back

చిరంజీవి, రాంచరణ్ మధ్య తేడా అదే... ప్రముఖ సినిమాటోగ్రాఫర్



Share via:

ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు ప్రస్తుతం అత్యంత భారీ సినిమాల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. టాప్ హీరోల భారీ సినిమాలకు పనిచేస్తున్న రత్నవేలు ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా రంగంలో వస్తున్న మార్పులు గురించి ముఖ్యంగా మెగా స్టార్ కి మెగా పవర్ స్టార్ కి మధ్య ఉన్న వ్యత్యసం గురించి ఆసక్తికర విషయాలను వివరించాడు...

చిరంజీవి, చరణ్ ల మధ్య స్పష్టంగా కనిపించే తేడాను బయటపెట్టాడు. రామ్ చరణ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ చరణ్ స్పాంటేనియస్ గా చేసిన ఫస్ట్ సీన్ లోనే బాగా నటించాడు అన్న అభిప్రాయం కలుగుతుంది అంటూ చరణ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రత్నవేలు.

అయితే చిరంజీవి మాత్రం దీనికి భిన్నం అని చెపుతూ ఎన్ని టేకులు తీసినా చిరంజీవి అలిసిపోడు సరికదా టేకులు తీస్తున్న కొద్ది చిరంజీవిలోని గొప్ప నటుడు బయటకు వస్తాడు అన్న విషయాన్ని వెల్లడించాడు ఈ క్రేజీ సినిమాటోగ్రాఫర్. అయితే షూటింగ్ స్పాట్ కు టైమ్ కు రావడంలో అదేవిధంగా అందరితోను చాల మర్యాదగా ఉండటంలో చరణ్ నూటికి నూరుపాళ్ళు చిరంజీవికి నిజమైన వారసుడుగా కనిపిస్తాడు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

అలాగే అభిమానులకి ఆసక్తికరమైన ఇంకో విషయం చెప్పారు...

‘రంగస్థలం’ మూవీ ఓపెనింగ్ సాంగ్ లో చరణ్ చిరంజీవి మూమెంట్స్ ను అనుసరిస్తూ ఒక ప్రయత్నం చేసాడని అది మెగా అభిమానులకు బాగా నచ్చుతుంది అన్న టాప్ సీక్రెట్ ను బయట పెట్టాడు రత్నవేలు.

Tags : Rathnavelu says DIfference Between Chiranjeevi and Ram Charan, Rangasthalam

Write a comment ...
Post comment
Cancel