back

మరో ఘనత సాదించిన రంగస్థలం



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఈ ఏడాది మర్చి 30న విడుదలైన సంగతి విదితమే. ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులు అన్ని చెరిపేసి తెలుగు సినీ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించింది.

అంతే గాక ఇప్పుడు వరల్డ్ టాప్ మూవీ రేటింగ్ సంస్థ అయిన ఐ.ఎం,డి.బి తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో భారత చిత్రాలన్నింటిలో ఏడవ స్థానంలో నిలిచింది. ఇప్పటికే మన చరణ్ నటించిన ఈ చిత్రం వసూళ్ళలో కొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇప్పుడు విడుదల చేసిన ర్యాంకులతో రంగస్థలం మరో ఎత్తు ఎదిగిందనే చెప్పాలి. ఇక ఇదే ర్యాంకుల్లో కీర్తి సురేష్ నటించిన 'సావిత్రి' జీవిత చరిత్ర "మహానటి" నాల్గవ స్థానంలో నిలిచింది.

rangasthalam imdb rank

రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్, సమంతా హీరో హీరొయిన్లుగా నటించగా ఆది పినిసెట్టి, అనసూయ, నరేష్, జగపతిబాబులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై సుకుమార్ తెరకేక్కించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు.


Tags : Rangasthalam, IMDB Rankings, Ram Charan

Write a comment ...
Post comment
Cancel