back

మలయాళంలో విడుదల కానున్న రంగస్థలం



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఎంతటి ఘన విజయం సాదించిందో మనందరికీ తెలిసిందే.

ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లోనే అతి పెద్ద విజయంగా నమోదవ్వడం విశేషం. ఈ చిత్రం పూర్తి పల్లెటూరు వాతావరణంలో 1980లో జరిగినట్టుగా చిత్రీకరణ చేసారు.

అయితే ఇప్పుడు మన 'రంగస్థలం' మలయాళంలో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ మలయాళంలో డబ్ చేసి విడుదల చేయనున్నట్టు సమాచారం.

మలయాళంలో చాలా పెద్ద క్రేజ్ ఉన్న తెలుగు నటుడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరి రంగస్థలం మలయాళం వెర్షన్ తో చెర్రీ కూడా అక్కడ మార్కెట్ ఓపెన్ చెయ్యాలని కోరుకుందాం.

రంగస్థలం చిత్రాన్ని సుకుమార్ తెరకేక్కించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ కాగా దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు.

Tags : Rangasthalam in Malayalam, Ram Charan

Write a comment ...
Post comment
Cancel