back

రాంచరణ్.. తండ్రిని అందుకుంటాడా... మించి పోతాడా..!Share via:

రంగస్థలం సినిమాతో ప్రేక్షకలను ఒక ఊపు ఊపిన రాంచరణ్ ఇప్పుడు నటుడుగా తన స్థాయిని అమాంతం పెంచేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. సుకుమార్ ఈ సినిమాను అద్బుతంగా మలిచాడు, ముఖ్యంగా రాంచరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేల చేసాడు, ఒక మంచి నటుడికి ఒక మంచి క్యారెక్టర్ రాస్తే ఎలా వుంట్టుందో మనకు చూపించాడు. మెగా అభిమానులనే కాకుండా ఈ సినిమా అందరిని అలరించింది. దీనితో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

రంగస్థలం 8 Days కలెక్షన్స్

అలాగే కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు నెలకొల్పుతుంది. ప్రస్తుతం రంగస్థలం చిత్రానికి వస్తున్న కలెక్షన్ల జోరు చూస్తుంటే రూ. 150 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే.... జై లవ కుశ, సరైనోడు,DJ చిత్రాల రికార్డులన్నీ బద్దలు అయిపోయాయి. ఇక మగధీర, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది చిత్రాలను త్వరలోనే అధిగమిస్తుంది.!

రంగస్థలం:
రాయలసీమ లో రంగస్థలం హవా...

తెలుగు చలనచిత్ర చరిత్రలో.. ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాల లిస్టులో బాహుబలి 2 మూవీ మొదటి స్థానంలో ఉండగా, బాహుబలి రెండో స్థానంలో ఉంది. రూ. 164 కోట్ల వసూళ్లతో ‘ఖైదీ నెం 150' చిత్రం మూడో స్థానంలో ఉంది. రంగస్థలం చిత్రం రూ. 150 కోట్ల మార్కును అధిగమిస్తే తెలుగు సినిమా చరిత్రలో టాప్ 4వ గ్రాసర్‌గా ఈ మూవీ రికార్డులకెక్కనుంది. అయితే మెగాస్టార్ ఖైదీ నెం 150 రికార్డును టచ్ చేస్తుందా? లేదా? అనేది వచ్చే వారానికి కానీ అంచనా వేయలేం...

మరిన్ని:
ఇప్పుడిది అవసరమా బన్నీ ..?.

గ్యాలరీ:
పవన్ కళ్యాణ్, జనసేన పాదయాత్ర ..ఫొటోస్.
రంగస్థలం 2nd వీక్ కొత్త పోస్టర్స్ ...

Tags : Rangasthalam Collections, Rangasthalam Targets Khaidi No.150 Collections, Chiranjeevi, Mega Star and Mega Power Star

Write a comment ...
Post comment
Cancel