back

రంగస్థలం చేసిన రచ్చకు హీరో విశాల్ కి వణుకు పుట్టింది...



Share via:

చెన్నైలో... తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తమిళ తంభిలు కూడా ‘రంగస్థలం’ కు కాసుల వర్షం కురిపిస్తూ ఉంటే ఆ వర్షానికి గొడుగు పెట్టి ఆపాడు తమిళ హీరో విశాల్. ‘రంగస్థలం’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేసిన నేపధ్యంలో తమిళనాడులో కూడ అక్కడి తెలుగువారు చూడటానికి భారీస్థాయిలో విడుదలచేసారు. అంతేకాదు చెన్నై పట్టణం అంతా ‘రంగస్థలం’ హోర్డింగ్స్ తో కళకళలాడింది.

మార్చి 1 నుంచి తమిళ కొత్తచిత్రాల ప్రదర్శన నిలిపివేసిన తరుణంలో, మార్చి 16 నుంచి షూటింగులు రద్దు చేస్తూ తమిళ చలనచిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై వచ్చి సమ్మెచేస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం తమిళ చలన చిత్రపరిశ్రమ అంతా తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనితో కొత్త సినిమాలకు మొఖం వాచిపోయి వున్నా తమిళ తంభిలకు మరియు అక్కడ వున్నాతెలుగు ప్రేక్షకులకు ‘రంగస్థలం’ వరంలా మారింది .అదిరిపోయే కలక్షన్స్ తో చెన్నైలో కూడ అద్భుతమైన వసూళ్ళు రాబట్టింది.

ప్రస్తుతం ఈ మూవీకి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో చెన్నై పట్టణం అంతా రంగస్థలం సినిమాని తమిళ స్టార్ హీరోల చిత్రాల లేవేల్ ల్లో ఎక్కువ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.

సమ్మె సమయంలో ఇతర భాషా చిత్రాల విడుదలను అడ్డుకోవాలన్న ఒత్తిడి తమిళ నిర్మాతల మండలి పై పడటంతో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో మాట్లాడి ‘రంగస్థలం’ సినిమా ప్రదర్శనను వెంటనే నిలుపుదల చేయమని లేకుంటే మాకు అన్యాయం జరుగుద్దని ప్రదేయపడ్డట్టు సమాచారం.

దీనితో ‘రంగస్థలం’ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా ప్రదర్శన నిలుపుదలకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే పెద్ద స్థాయిలో వసూళ్ళు కొల్లగొట్టింది. a href="http://www.only4megafans.com/news/rangasthalam-1st-week-collections">రంగస్థలం 1st Week కలెక్షన్స్ ఇక్కడ చూడొచ్చు...

Tags : Rangasthalam in Chennai, Rangasthalam Stops in Tamil Nadu, Vishal on Rangasthalam, Rangasthalam in Tamil Nadu, Ram Charan, Samantha

Write a comment ...
Post comment
Cancel