back

రంగస్థలంని కాపాడుకోవడం ఎలా?



Share via:

అన్ని వర్గాలను మెప్పిస్తూ రిలీజ్ అయిన వారం లోనే అన్ని ఏరియాలలో పంపిణీదారులను లాబాల్లోకి తీసుకెళ్ళిన రంగస్థలం సినిమా...ఇంకా ఊపు కొనసాగిస్తూనే ఉంది. కాని ఇప్పుడు సినిమా నిర్మాతలకు కొత్త కష్టం వచ్చి పడింది. ఈ సినిమాలు ప్ర్రాణం అయిన రంగస్థలం ఊరు సెట్ ని జూబ్లీహిల్స్లో కొండ పైన వేసారు. ఇప్పుడు దాని పరిరక్షణ నిర్మాతలకు పెద్ద సమస్య అయింది.

రంగస్థలం 8 Days కలెక్షన్స్

ఆర్ట్ డైరెక్షన్ చేసిన రామకృష్ణ-మౌనికలకు జాతీయ అవార్డు రావడం ఖాయమని సినిమా చూసిన అధిక శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేసారు కూడా. ఇప్పుడు ఈ సెట్ విజిటర్స్ స్పాట్ గా మారిపోయింది. పలు టీవీ ఛానల్స్ అక్కడికి వెళ్లి ప్రత్యేకంగా యూనిట్ తో ఇంటర్వ్యూలు చేయటంతో పాటు అదే పనిగా విజువల్స్ ని టెలికాస్ట్ చేయటంతో నగరవాసులు తమకు ఇంత దగ్గరలో ఉన్న రంగస్థలాన్ని చూడాలన్న ఉద్దేశంతో వచ్చేస్తున్నారు. అందులో ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో పబ్లిక్ హ్యాపీగా ప్రవేశిస్తున్నారు. దీంతో అక్కడున్న వాటి సెక్యూరిటీ పెద్ద సమస్య మారి సెట్స్ తో పాటు అందులో భాగంగా వేసిన విగ్రహాలు కట్టడాలు అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. కొందరు ఈ సెట్ లో షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసేస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమా రెండో భాగం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు, అంటే మరి అప్పటి వరకైనా దీన్ని కాపాడుకోవాలి కదా. ఏమి చేయాలో దిక్కు తోచని నిర్మాతలు ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ తో మాట్లాడినట్లు తెలుస్తుంది.

Tags : Rangasthalam Set, Ram Charan, Samantha, Sukumar, Rangasthalam Movie

Write a comment ...
Post comment
Cancel