back

రంగస్థలం రిపోర్ట్: రంగస్థలం హిట్టు... రాంచరణ్ సూపర్ హిట్



Share via:

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో స‌మంత హీరోయిన్‌గా తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమా ఈ రోజు ఉద‌యం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం గురువారం అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద మెగా ఫ్యాన్స్ నానా హంగామా చేసేశారు. AP లో అన్ని థియేట‌ర్ల‌లోనూ ఉద‌యం 5 గంట‌ల‌కే షోలు స్టార్ట్ అయ్యాయి అలాగే తెలంగాణాలో ఉదయం 8:30 గంటల నుండి.. ఇక సినిమా ఫ‌లితంపై యూనిట్ ప‌క్కా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు...

ఇక సినిమాలో హైలెట్ అంశాలపై అప్పుడే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. మ‌న‌కు అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం, చెర్రీ కెరీర్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో చేయ‌ని రేంజ్‌లో నటన కనబర్చాడట. ఈ సినిమాలోని చిట్టిబాబు రోల్ చెర్రీ కెరీర్‌లో ఎప్ప‌ట‌కీ గుర్తుండిపోయే రోల్ అవుతుంద‌ని అంద‌రూ అంటున్నారు.

ఇక ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం, గ్రామీణ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో సాగే ఈ కథ ఆహ్లాదకరంగా ఉందంట్టున్నారు. సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని తెలుస్తోంది. ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా చివరి వరుకు ఒకే ఎమోషన్ ను క్యారీ చేస్తూ సినిమా సాగుతుందని సమాచారం. సినిమాలో హైలైట్ సీన్ ఇంటర్వెల్‌కి ముందు ఉంటుందని తెలుస్తోంది. బలమైన ఈ కథలో కీలక మలుపుతిప్పే సన్నివేశం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అంటున్నారు. ఇంటర్వెల్ ముగిసి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే ఉత్కంఠను రేకెత్తించేలా ఈ సినిమా ఉందంటున్నారు.

చిరు తనయుడిగా తెరంగేట్రం చేసిన రాం చరణ్ ,నటుడిగా సంతృప్తినిచ్చే పాత్ర ఇంతవరకు చేయలేదు. అయితే సుకుమార్ రంగస్థలం రాం చరణ్ లోని నటుడిని పరిచయం చేసిందని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ చెర్రి నటనకు ఫిదా అయ్యారని తెలుస్తుంది.

ఇక మొదటి షో టాక్ పాజిటివ్ గా రావడంతో సినిమా రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ లో వచ్చిన ఈ రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆడియో ఇప్పటికే సంచలనాలు నమోదు చేసింది.. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది రామ్ చరణ్ కెరియర్ లో రంగస్థలం ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేయగల సత్తా కొంతమంది హీరోలకే ఉంది. ఇప్పుడు ఆ కేటగిరిలో చరణ్ కూడా చేరిపోయాడు.

రచయితలు ఇంకా... మీ పెన్ను కి పదును పెట్టండి మరో యంగ్ చిరంజీవి తయారయ్యాడు.

Tags : Rangasthalam Review, Rangasthalam Ratings, Ram Charan's Rangasthalam Movie Review, Rangasthalam Telugu Movie Review

Write a comment ...
Post comment
Cancel