back

రాయలసీమ లో రంగస్థలం హవా...



Share via:

రాయలసీమ నాలుగు జిల్లాలను సినిమా బాషలో సీడెడ్ అంటారు. మాస్ సినిమాలకు సీడెడ్ లో మంచి ఆదరణ ఉంటుందని అభిప్రాయం కాని ఈ మధ్య కాలం లో అన్నిమంచి సినిమాలకు సీడెడ్ లో మంచి ఆదరణ లభిస్తోంది. మామూలుగా బాలక్రిష్ణ గారి సినిమాలు రాయలసీమ మార్కెట్ ని బాగా ప్రభావం చూపించేవి, తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ సినిమాలు కూడా సీడెడ్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి.

ఇప్పుడు రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమా రాయలసీమ ప్రజలను ఎంతగా ఆకట్టుకుంది అనేది కలెక్షన్స్ నిరుపిస్తున్నాయి. బాహుబలి 1 ని మించిన మొదటి వారం 11.50 కోట్ల వసూళ్లతో పాటు బాహుబలి 2 కి కూడా దక్కని ఒక రికార్డు తన సొంతం చేసుకుంది . అదేంటంటే సీడెడ్ లో ప్రతి రోజు 1 కోటి పైన షేర్ తో వారం పాటు ఏ సినిమా కూడా ఆడలేదు , ఇప్పుడు రంగస్థలం ఆ రికార్డు ని చెరిపేసింది. దీంతో రాంచరణ్ రాయలసీమ లో తన జెండాని బలంగా పాతేసినట్లే.

రంగస్థలం 1st Week కలెక్షన్స్

Tags : Rangasthalam in Rayalaseema, Ram Charan, Samantha, Rangasthalam Collections

Write a comment ...
Post comment
Cancel