back

నైజాంలో రికార్డు దిశగా రంగస్థలం పయనం



Share via:

తెలంగాణ ప్రాంతంను సినిమా బాషలో నైజాం అంటారు. ఫ్యామిలీ మరియు క్లాసు/మాస్ మిక్స్ సినిమాలకు నైజాంలో మంచి ఆదరణ ఉంటుందని అభిప్రాయం. ఇప్పుడు రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమా ఈ ప్రాంత ప్రజలను ఎంతగా ఆకట్టుకుంది అనేది కలెక్షన్స్ నిరుపిస్తున్నాయి. మొదటి వారంలోనే రికార్డ్ స్థాయి షేర్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.19.60 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుని త్వరలోనే రూ. 20 కోట్లను అందుకోనుంది.

రామ్ చరణ్ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ గా రికార్డులకెక్కిన ‘మగధీర’ నైజాం లో రూ.22.64 కోట్ల తర్వాత ఆ స్థాయి కలెక్షన్లను పొందిన చిత్రంగా ‘రంగస్థలం’ నిలిచింది. మగధీర రికార్డ్ని కూడా బద్దలు అవ్వడం కాయం అని ట్రేడ్ వర్గాల మాట.

సినిమా నిన్నటి ఆదివారం వరకు మొత్తం రూ.95 కోట్ల షేర్ తో తొందరలో 100 కోట్ల మార్క్ ని అందుకునే దిశగా సాగుతుంది.

Tags : Rangasthalam in Nizam, Rangasthalam Collections, Ram Charan, Mega Power Star, Samantha, Sukumar

Write a comment ...
Post comment
Cancel