back

చెన్నైలో మోత మోగుతున్న రంగస్థలం



Share via:

రామ్ చరణ్... జన్మదినం పురస్కరించుకొని మంగళవారం విడుదలయిన జిగేలు రాణి ప్రోమో సాంగ్ ఒక ఉపు ఊపెస్తుంది. ఇప్పటికే ఈ పాట 7 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించింది. అలాగే అన్ని పాటలు సూపర్ హిట్ సాంగ్స్ గా నిలిచాయి.

ఈ సందర్బంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు... "నిన్న హీరో సూర్య మెసేజ్ చేసారు పాటలు చాల అద్భుతంగా ఉన్నాయి... ఇక్కడ చెన్నై లో కూడా పాటలు మారుమ్రోగుతున్నాయి అని చెప్పారు".

"అలాగే అల్లు అర్జున్ కాల్ చేసి రోజు రంగస్థలం పాటలతోనే కలం గడుస్తుంది అని చెప్పారు, ఇక KTR గారు కూడా మెసేజ్ చేసారు మంచి పాటలు ఇచ్చారు చాల రోజుల తర్వాతా మంచి పాటలు విన్న అంటూ అభినందించారు" అంటూ బావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

దేవి మాటల్లో...


ఈ విజయం నా ఒక్కడిదే కాదు మా టీం కృషి అని ముఖ్యంగా చంద్రబోసు గారి వల్ల ఇంతటి సూపర్ హిట్ ఆల్బం తయారయింది... ఆయన నేను కూర్చొని కేవలం 4 రోజుల్లో సాంగ్స్ అన్ని పూర్తి చేసాం. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ కి, మరియు సుకుమార్ గారికి కృతజ్ఞతలు.

అయితే ఈ 5 సాంగ్స్ మాత్రమే కాదు, ఇంకో సర్ ప్రైజ్ సాంగ్ ఉంటుంది అది సినిమాలోనే చూడాలి అంటూ చెప్పారు. ఆ సాంగ్ ఇంకెంత బాగుంటుందో... రేపు ధియేటర్ లో చూడాలి..!

రంగస్థలం లోని అన్ని పాటలని ఇక్కడ చుడండి...

Tags : Rangasthalam Fever in Chennai, Rangasthalam in Chennai, Rangasthalam Songs, Devi Sri Prasad, Ram Charan

Write a comment ...
Post comment
Cancel