back

రంగస్థలం ప్రభంజనం.. ఆస్ట్రేలియాని కూడా వదల్లెదుగా..!



Share via:

భారీ అంచనాల మధ్య వచ్చిన రంగస్థలం రికార్డులను సృష్టించడం మొదలు పెట్టింది. ఒక సినిమా హిట్టా, ఫట్టా అని నిర్ణయించేది కలెక్షన్లే. నిన్న విడుదలయిన ఈ చిత్రం వసూళ్లపరంగా దూసుకుపోతుంది. ఇటు ఇండియాలో, అటు ఓవర్సీస్ కనకవర్షం కురిపిస్తుంది. అమెరికాలో కేవలం ప్రివ్యూల ద్వారా రూ.4.39 కోట్లను రాబట్టిన ఈ సినిమా శుక్రవారం నాటికి ఒక మిలియన్ అమెరికన్ డాలర్లను కొల్లగొట్టింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఆస్ట్రేలియాలో రంగస్థలం కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. నిన్న శుక్రవారం నాటికి రూ. 83.04 లక్షలను సాధించి తెలుగు సినిమాల మార్కెట్ పెరుగుతోంది అనే ఆశను, అభివృద్ధిని తెలిపింది. ఈ విషయాన్నే ప్ర‌ముఖ సినీ విమర్శకుడు మరియు ట్రేడ్ అన‌లిస్ట్ త‌రుణ్ ఆద‌ర్శ్ ట్విట్టర్లో ధృవీకరించారు.

Tags : Rangasthalam in Australia, Ram Charan, Rangasthalam Collections

Write a comment ...
Post comment
Cancel