back

రంగస్థలం - డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు..!



Share via:

రంగస్థలం సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అంచనాలను విపరీతంగా పెంచుతుంది. ఫస్ట్ లుక్, సాంగ్స్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. అంతే కాదు రంగస్థలం సినిమా పాటలకు సంబంధించి ఒక్కో ప్రోమో రిలీజ్ చేస్తూ మరింత ఆసక్తి రేపుతున్నారు. తాజాగా సినిమా మేకర్లకు కొత్తగా వచ్చిన ఆదాయ వనరు డిజిటల్ రైట్స్. ఇంటర్నెట్ విస్తృత‌ స్థాయిలో అందుబాటులోకి వచ్చాకా.. సినిమాలకు డిజిటల్ రైట్స్ ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఎంతలా అంటే.. శాటిలైట్ రైట్స్ కు తీసిపోని రీతిలో సినిమాకు డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి.

అది కూడా కోట్ల రూపాయల్లో సంపాదన వస్తుంది. ఈ పరంపరలో రామ్ చరణ్ తేజ తాజా సినిమా ‘రంగస్థలం 1985’ డిజిటల్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం.

ఏకంగా పది కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించి అమెజాన్ సంస్థ రామ్ చరణ్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లో రంగస్థలం భారీ వ్యాపారాన్నే చేసింది. మార్చి 30న రంగస్థలం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

ఇక రిలీజ్ అయిన తర్వాత ఇంక ఎన్ని రికార్డులు ..నెలకొల్పుతుందో వేచి చూడాలి.

Tags : Rangasthalam Digital Rights, Rangasthalam in Amazon Prime, Ram Charan

Write a comment ...
Post comment
Cancel