back

రంగస్థలం రికార్డుల...వేట.!



Share via:

భారీ అంచనాల మధ్య వచ్చిన రంగస్థలం రికార్డులను సృష్టించడం మొదలు పెట్టింది. ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ప్రవేశించిన రంగస్థలం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 30 నుండి 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంటున్నారు.

అయితే పక్కాగా కలక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే కనుక రాంచరణ్ కెరియర్ లో ఇదే హయ్యెస్ట్ ఫస్ట్ డే కలక్షన్స్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమాతో తనలో ఉన్న నట విన్యాసాన్ని చూపించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్, తన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ఇంటా బయట, ఊరు వాడా డప్పేసి మెగా ఫ్యాన్స్ జబ్బ చరిచి మరి హంగామా చేస్తున్నారు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని, కొత్త రికార్డు ల వైపు పరుగులు పెడుతుంది.

ఈ రికార్డుల రంగస్థలం బీభత్సం చూస్తుంటే చెర్రి కెరియర్ లో హయ్యెస్ట్ ఫిగర్ అందుకునేలా ఉన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే రంగస్థలం మేనియా కొనసాగిస్తుంది. ఎలాగు వీకెండ్ కాబట్టి ఈ రెండు రోజుల్లోనే 50 కోట్లు గ్రాస్ ని.. క్రాస్ అయిన ఆశ్చర్యపడనక్కర లేదు. మొత్తానికి ఈ సమ్మర్ మెగా హిట్ తో ప్రారంభం అయ్యిందని చెప్పాలి.

రంగస్థలం పబ్లిక్ రెస్పాన్స్

రంగస్థలం రివ్యూ

Tags : Rangasthalam US collections, Rangasthalam Review, Rangasthalam Movie, Ram Charan, Samantha

Write a comment ...
Post comment
Cancel