back

'మాటివి' ని అగ్ర స్థానాన నిలబెట్టిన రంగస్థలం ..



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన విల్లెజ్ డ్రామా ‘రంగస్థలం’. ఈ వేసవిలో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 120కోట్ల పైన షేర్ ను రాబట్టి ‘బాహుబలి’ చిత్రం తరువాత తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

చిట్టిబాబుగా థియేటర్లలో దుమ్ముదులిపిన రామ్ చరణ్, ఇప్పుడు బుల్లితెరపై కూడా తన మార్క్ చూపించాడు. స్టార్ మా టెలివిజన్ లో ప్రసారమైన ఈ సినిమాకు 19.5 టీఆర్పీ వచ్చింది. రంగస్థలం అండతో 'స్టార్ మా' మరోసారి తన నంబర్ వన్ పొజిషన్ ను నిలబెట్టుకుంది. కాకపోతే టీఆర్పీల్లో రంగస్థలం నంబర్ వన్ మాత్రం కాదు. టీఆర్పీల్లో ఇప్పటికీ బాహుబలి పార్ట్-2, పార్ట్-1దే రికార్డు. ఈ రెండు సినిమాల మధ్యలో మగధీర సినిమా కూడా ఉంది. డీజే, ఫిదా, శ్రీమంతుడు టీఆర్పీలు 21కి అటుఇటుగా ఉన్నాయి. జనతాగ్యారేజ్ కు 20.6 టీఆర్పీ వచ్చింది. వీటితో పోలిస్తే రంగస్థలం రేటింగ్ తక్కువే.

ఎందుకంటే, విడుదలైన అతి తక్కువ టైమ్ కే (45 రోజులకే) ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో పెట్టేశారు. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ సినిమాను లక్షల మంది చూశారు. ఈ గ్యాప్ లో రంగస్థలం హెచ్ డీ పైరసీ ప్రింట్ కూడా వచ్చేసింది. చాలా ఏరియాల్లో లోకల్ ఛానెల్స్ లో ఈ సినిమాను విచ్చలవిడిగా ప్రదర్శించారు. అయినప్పటికీ ఈ సినిమాకు టీవీల్లో మంచి రేటింగ్ రావడం విశేషం.

Tags : Rangasthalam, TRP Ratings, Maa TV

Write a comment ...
Post comment
Cancel