back

రంగస్థలం: బాబోయ్.. బాక్స్ లు బద్దలవుతున్నాయి...



Share via:

రంగస్థలం కలెక్షన్ల సునామీలో ఒక్కొక్క సినిమా రికార్డ్స్ కొట్టుకుపోతున్నాయి. ఈ సినిమా అన్ని ఏరియా ప్రేక్షకల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంట్టుంది. యావత్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. దీనితో అన్ని ఏరియాలలో కలెక్షన్ల కనక వర్షం కురుస్తుంది. రంగస్థలం రూపంలో సగటు ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సినిమా వచ్చింది అంటూ అటు సామాన్య జనం ఇటు సినిమా జనం పొగడ్తలతో ముంచేస్తున్నారు.

చాలా రోజులయ్యింది థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అనే వాటిని చూసి.... రంగస్థలం వల్ల ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ తోనే పలు రికార్డ్స్ తుడిచేస్తే ఇక ముందు ముందు ఇంకా ఎన్ని రికార్డ్స్ నమోదు చేస్తుందో చూడాలి.. ఇప్పటికే రంగస్థలం సినిమా US లో 2 మిలియన్ క్రాస్ చేసి ఇంతకు ముందు ఉన్న శ్రీమంతుడు రికార్డుని తుడిపెసింది.

రాంచరణ్ నెక్స్ట్ తన తండ్రి ఖైది నెంబర్ 150 రికార్డ్స్ పై గురిపెట్టాడు, త్వరలోనే ఆ రికార్డ్స్ కూడా బద్దలయే ఛాన్స్ ఉంది. ఇప్పటికే DJ, జనత గ్యారేజ్ మూవీల లాంగ్ రన్ కలెక్షన్స్ ని 3 రోజుల్లోనే అధిగమించి... మెగా పవర్ స్టార్ సత్తా ఏంటో చూపించాడు.

3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ దాదాపుగా 80 కోట్ల పైనే ఉండొచ్చని ట్రేడ్ బావిస్తుంది. మరి కాసేపట్లో ఫుల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు...

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : Rangasthalam in 3 Days, Ram Charan, Rangasthalam Collections, Ram Charan, Samantha, Sukumar

Write a comment ...
Post comment
Cancel