back

చైనాకి వెళ్తున్న రంగస్థలం



Share via:

దంగల్ సినిమాతో చైనా మార్కెట్లో మనకి ఎంత మంచి అవకాసం ఉందో అమీర్ ఖాన్ నిరూపించారు. దంగల్ అక్కడ 1000 కోట్ల పైన వసూళ్లు సాధించి కంటెంట్ ఉన్న సినిమాలు అక్కడి జనాలు బ్రహ్మ రథం పడతారు అనేది ప్రూవ్ చేసింది.

రాంచరణ్ మరియు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంతగా ఇంప్రెస్ చేసిందంటే.. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఓవర్సీస్ లో కలుపుకుని మొత్తంగా 125+ కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ రేంజులో హిట్టయిన సదరు సినిమాను హిందీలో రిలీజ్ చేయికపోయినా కూడా టివిల్లో ఎలాగో హిందీ వర్షన్ తో కుమ్మేస్తారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను చైనాకు పంపే యోచనలో ఉన్నారు రామ్ చరణ్ అండ్ కో. దంగల్ సినిమా నుండి సీక్రెట్ సూపర్ స్టార్ వరకు.. ఇండియాలో ఎలా ఆడినప్పటికీ.. ఇప్పుడు చైనాలో ఆడిన తీరు మాత్రం అద్భుతం. అందుకే చరణ్ కూడా ఎంతో కంటెంట్ అండ్ కనక్టివిటీ ఉన్న తమ సినిమాను చైనీస్ బాషలోకి డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

#RRR తర్వాత మరో సినిమాని ఒప్పుకున్న రాంచరణ్..

Tags : Rangasthalam in China, Mega Power Star Ram Charan, Samantha

Write a comment ...
Post comment
Cancel