back

మెగా హీరోలకు అచ్చొచ్చిన బ్రదర్ సెంటిమెంట్ ...!



Share via:

ఒక్కొరకం సినిమాలకు ఒక్కోరు సరిపోతారు అని పాత కాలంలో అలాంటి సినిమాలే తీసేవాళ్ళు నటులు. కృష్ణ గారి ఆ నడవడికను మారుస్తూ ప్రయోగాలూ చేయడంతో మిగతా నటులు కూడా వైవిధ్య భరితమైన పాత్రలు చేయడానికి ముందుకు వచ్చారు. తర్వాత చిరంజీవి ఎంట్రీ తో సినిమాల రూపమే మారిపోయి సరికొత్త రూపంలో కి వచ్హాయి.

కాని ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని పాత్రలు మాత్రం ఎప్పుడూ ప్రేక్షకుడిని మెప్పిస్తునే ఉన్నాయి. అందులో అన్నదమ్ములు, అన్న చెల్లెలు సెంటిమెంట్ సినిమాలు సినిమా మోదులైనప్పుడు నుంచి హిట్ ఫార్ములానే. అందులో మెగా హీరోలకు ఈ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చినట్లు ఉంది. మెగాస్టార్ చిరంజీవి అన్నదమ్ముల సెంటిమెంట్‌తో నటించిన 'విజేత', 'గ్యాంగ్ లీడర్', 'హిట్లర్', 'అన్నయ్య' వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా బ్రదర్ సెంటిమెంట్‌తో 'తమ్ముడు' చేసి.. హిట్ కొట్టాడు. బన్నీ బ్రదర్ సెంటిమెంట్‌తో చేసిన 'రేసుగుర్రం' కూడా ఘన విజయాన్ని సాధించింది.

రంగస్థలం 8 Days కలెక్షన్స్

ఇక.. రీసెంట్ గా రాంచరణ్ కు కూడా ఈ బ్రదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. ఆద్యంతం పల్లెటూరి నేపథ్యంలం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రంగస్థలం' చిత్రంలోని అన్నదమ్ములైన రాంచరణ్, ఆది పినిశెట్టి మధ్యన వచ్చే సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ఆది చనిపోఎప్పుడు చరణ్ నటనకి అందరికీ కన్నీరు ఆగలేదంటే అతిశయోక్తి కాదు. 1980ల బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలోని బ్రదర్ సెంటిమెంట్‌ను బాగా ఎలివేట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్.

ఇక చూద్దాం మునుముందు ఇంకెన్ని సినిమాలు ఈ సెంటిమెంట్ కథాంశంతో వస్తాయో.

Tags : Mega Heroes Brother Sentiment, Rangasthalam Brother Sentiment, Mega Power Star Ram Charan, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel