back

పోకిరి రికార్డును బద్దలుకొట్టిన రంగస్థలం



Share via:

రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ ని ఎలా షాకే చేసిందో మనందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యి ఇప్పటికి సుమారు 90 రోజులు అవుతుంది, ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన రంగస్థలం కొన్ని సినిమా థియేటర్లలో ఇప్పటికి ప్రదర్శితమవుతుంది.

కొన్ని కొత్త సినిమాలకంటే కూడా రంగస్థలం సినిమాకే కలెక్షన్లు ఎక్కువగా రావడం గమనార్హం.

ఇక విషయానికి వస్తే, రంగస్థలం తన 89వ రోజున 1.62 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది పూరి జగన్నాధ్ - మహేష్ బాబు కలయికలో వచ్చిన 'పోకిరి' కన్నా ఎక్కువ. 89వ రోజున పోకిరి సినిమా 1,61,43,081 మాత్రమె వసూలు చెయ్యగలిగింది.

12 సంవత్సరాల క్రితం రికార్డును ఇప్పుడు డిజిటల్ ఛానళ్ళు వచ్చిన తర్వాత కూడా రంగస్థలం సినిమా బద్ధలుకోట్టడం నిజంగా అద్బుతమే!

Tags : Rangasthalam Beats Pokiri Record, Mega Power Star, Ram Charan, Pokiri

Write a comment ...
Post comment
Cancel