back

అమెజాన్ ప్రైమ్ లో రంగస్థలం || మే 13 నుంచి



Share via:

గత కొంతకాలంగా కొత్త సినిమాలు రిలీజ్ అవ్వకముందే వాటితో ఒప్పందాలు చేసుకుని తమ పోర్టల్ లో పెడుతున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇప్పుడు తన వీక్షకుల కోసం రంగస్థలం ని ఈ మే 13 న తీసుకువస్తోంది. మెగా పవర్ స్టార్ట్ హోదా ఉన్న రామ్ చరణ్ ఓ మట్టి మనిషిగా కనిపించి పల్లెటూరి వాతావరణంలో దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తీసిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఈ ఏడాది నచ్చిన మొదటి సినిమా కావడంతో సినిమా దాదాపు 200 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో చేరింది. ఇప్పటికీ చాలా థియేటర్లులో దిగ్విజయంగా నడుస్తున్న సినిమా 50 రోజుల వైపు అడుగులు వేస్తుంది.

కలెక్షన్స్: రంగస్థలం 41 డేస్ కలెక్షన్స్

వీడియో సాంగ్: రంగ రంగ రంగస్థలాన...

థియేటర్లు లో నడుస్తున్న కుడా ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 13 అంటే 45 వ రోజు నుంచి ప్రసారం అవ్వనుంది. మరి దీని ఎఫెక్ట్ థియేటర్ల పైన ఎంతవరకు ప్రాభవం చూపిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఈ ఆన్లైన్ పోర్టల్ని ఎక్కువగా సిటి ప్రజలే చూస్తారు, మరి పల్లెవాసులని, మాస్ జనాలని విపరీతంగా ఆకట్టుకున్న రంగస్థలంకో ఇంకా నడిచే అవకాసం ఉంది.

ఫోటోలు: నా పేరు సూర్య థాంక్స్ మీట్

Tags : Rangasthalam in Amazon Prime, Mega Power Star, Ram Charan, Rangasthalam Full Movie

Write a comment ...
Post comment
Cancel