back

రంగస్థలం: ఫస్ట్ డే రికార్డులు అన్ని బద్దలు అవుతాయా...?



Share via:

ఈ శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న‘రంగస్థలం’ సినిమా ఫస్ట్ డే రికార్డులు అన్ని బద్దల దా కొడుతుందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దాదాపు ఏడాది పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్, అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా చరణ్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని కూడ అంటున్నారు. మంచి బడ్జెట్ తో రూపొంది, భారీస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన ఈ సినిమా ఓపెనింగ్స్ పైనే అందరి దృష్టి ఉంది.

ఈ వారం ఈ సినిమా మినహా వేరే పెద్ద, చిన్న సినిమాలేవీ లేకపోవడంతో దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో ఈ సినిమానే ప్రదర్శింపబడనుంది. సినిమా బాగుంటే లాంగ్ రన్లో చిత్రం చరణ్ కెరీర్లోనే ఉత్తమమైన వసూళ్లను నమోదు చేసే అవకాశాలున్నాయి. ఓవర్సీస్లో కూడ ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ నెలకొని ఉండటంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Tags : Rangasthalam 1st Day, Rangasthalam Records, Rangasthalam Collections, Ram Charan, Samantha, Sukumar

Write a comment ...
Post comment
Cancel
charan
2018-03-29 06:46:24

Anni RECORDULU baddhale


Reply
Post comment
Cancel