back

యుట్యుబ్ లో సంచలనంగా రంగమ్మ మంగమ్మ



Share via:

రంగస్థలం సినిమాకు కథ మరియు నటుల అభినయం ఎంతగా దాని విజయం కి దోహదపడ్డాయో, అందులోని పాటలు కూడా అంతగానే విజయం సాధించాయి. అందులోనూ ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ పాట ఊహించలేనంత హిట్ అయింది. ఇప్పుడు ఈ పాత యుట్యుబ్ లోను సంచలనాలు సృస్తిస్తోంది.

ఈ పాట వీడియో యూట్యూబ్ లో పెట్టిన నెలరోజులకే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అతి తక్కువ టైంలో 43 మిలియన్లకు పైగా వ్యూస్ ఈ పాటకు వచ్చాయంటే జనాలు ఎంత ఉత్సాహంగా ఈ పాట చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. రోజురోజుకు ఈ పాట చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు తెలుగులో అత్యధిక వ్యూస్ రికార్డ్ ఫిదాలోని వచ్చిండే.. మెల్లమెల్లగా, బాహుబలి-2లోని సాహోరే సాంగులకు ఉంది. ఈ రెండు పాటలకు ఇప్పటికి 120 మిలియన్ వ్యూస్ పైగా ఉన్నాయి. కాకుంటే ఈ రెండు పాటలు యూట్యూబ్ లో పెట్టి 10 నెలలు దాటింది. కానీ రంగమ్మా.. మంగమ్మా పాట జోరు చూస్తుంటే ఈ రికార్డును అంతకన్నా తక్కువ టైంలోనే దాటుకుని దూసుకెళ్లిపోయేలా ఉంది. మొత్తానికి చిట్టిబాబు - రామలక్ష్మి జంట మామూలుగా మాయ చేయలేదుగా.

Tags : Rangamma Mangamma Full Video Song, Ram Charan, Samantha, Rangasthalam

Write a comment ...
Post comment
Cancel