back

బాహుబలి 2 తర్వాత చిట్టి బాబే .....



Share via:

బాహుబలి 1 & 2 వసూళ్ళలో ఎన్ని సంచలనాలు సృష్టించాయో మనకందరికీ తెలిసిందే... వీటి తర్వాత ట్రేడ్ కి అంత ఆసక్తి కలిగించిన సినిమా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం. ఈ సినిమా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు మంచి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చిందనే చెప్పాలి. సాధారణంగా సినిమా విడుదలై నెల రోజులు దాటితే కలెక్షన్స్ లో తేడా వచ్చేస్తాయి. ఇక వెబ్ మీడియాలు రిలీజ్ చేస్తే కలెక్షన్స్ క్లోజ్ అవ్వాల్సిందే. కానీ రంగస్థలం సినిమా యాబై రోజుల తరువాత కూడా మంచి షేర్స్ అందుకుంది. బయ్యర్లకు బాగా ఊహించని లాభాలను అందించిందని ఒప్పుకోవాల్సిందే.

ఖైది నెం 150 తో బాహుబలి 1 మొదటి వారం కలెక్షన్స్ ని చిరంజీవి బీట్ చేయగా ఇప్పుడు ఫుల్ కలెక్షన్స్ లో చరణ్ తన రంగస్థలం తో బీట్ చేసాడు. ఏరియాల వారిగా రంగస్థలం పోసిషన్ ఇలా ఉంది .....

గతంలో ఎప్పుడు లేని విధంగా అమెజాన్ ప్రైమ్ లో రంగస్థలం సినిమా విడుదలైనప్పటికి కూడా మంచి షేర్స్ అందుకుంది. ఏ సినిమా కూడా ఈ స్థాయిలో అందుకోలేదు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి సినిమా తరువాత అత్యంత ఎక్కువ కలెక్షన్స్ షేర్స్ అందుకున్న సినిమాగా రంగస్థలం నిలిచింది.

Tags : Rangasthalam, Bahubali, Mega Power Star, Ram Charan

Write a comment ...
Post comment
Cancel