back

RRR లో రమ్యకృష్ణ.. నదియా..?



Share via:

ప్రతి రోజు రాజమౌళి-రాంచరణ్-ఎన్టీఆర్ కాంబోలో తీస్తున్న RRR సినిమాకి సంబంధించి ఏదో ఒక వార్త సినిమా సర్కిల్స్ లో సంచరిస్తూనే ఉంటున్నాయి. అలాగే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఈ సినిమాలోని రెండు ముఖ్య పాత్రలకు రాజమౌళి ఇద్దరు పాత తరం హీరోయిన్లను సెలెక్ట్ చేసారంట.

వారే బహుబలిలో శివగామి దేవి రమ్యకృష్ణ ఒకరైతే, అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించిన నదియా ఇంకొకరు.

మరి ఈ విషయం పై షరా మాములుగానే ఈ మల్టీస్టారర్ యూనిట్ సభ్యులు స్పందించటం లేదు. ఇక ఈ చిత్ర హీరోయిన్స్ విషయంలో కూడా జక్కన్న అండ్ టీం క్లారిటీ ఇవ్వలేదు. మొదటి షెడ్యూల్ మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు.

రెండవ షెడ్యూల్ లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా నటించబోతున్నారు. అప్పుడు అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే నిన్నటి నుంచి వినిపిస్తున్న 12-12-12 న వచ్చే అనౌన్స్ మెంట్ లో అన్ని విషయాలు వెల్లడిస్తారో... వెయిట్ అండ్ సి అంతే ..

Tags : RRR, Ram charan, Jr NTR, Nadhiya, Ramya Krishna

Write a comment ...
Post comment
Cancel