back

వినయ విదేయ రామ’ టార్గెట్ అంతనా..! సాధ్యమేనా..?



Share via:

డి.వి.వి.దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా ని బోయపాటి తన స్టైల్ లో భారీ తారాఘనంతో భారీ సెట్టింగ్స్ మరియు కొత్త లొకేషన్స్ లో చిత్రీకరించాడు. సినిమా బడ్జెట్ కూడా 65 కోట్ల మేర ఐనట్లు ఇండస్ట్రీ బోగోట్టా ..

ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్

సంక్రాంతికి భారీ పోటీ రిలీజ్ కానున్న సినిమాలలో ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో మాత్రం 'వినయ విధేయ రామ' అన్నిటినీ దాటేసి మొదటి స్థానం లో నిలిచింది.


రాంచరణ్ లాస్ట్ సినిమా 'రంగస్థలం' బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే ఈ క్రేజుకు కారణం.  'వినయ విధేయ రామ'  ఏరియా వైజ్ థియేట్రికల్ రైట్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజామ్: 19 కోట్లు
సీడెడ్: 14 కోట్లు
ఉత్తరాంధ్ర: 11.70 కోట్లు
ఈస్ట్ : 7.20 కోట్లు
వెస్ట్: 5.60 కోట్లు
కృష్ణా: 6 కోట్లు
గుంటూరు: 7.70 కోట్లు
నెల్లూరు: 3.50 కోట్లు
ఏపీ + తెలంగాణా: 74.7 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా : 8.50 కోట్లు
ఓవర్సీస్: 9 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 92.20 కోట్లు

రాంచరణ్ సీక్రెట్ ని చెప్పేసిన కియారా అద్వాని

92 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా హిట్ అని చెప్పాలంటే కనీసం 100కోట్ల షేర్ రాబాట్టాలి. కాని ఈ సారి సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉంది. బాలక్రిష్ణ “కథానయాకుడు”, వెంకటేష్-వరుణ్ ల “F2”, రజనీకాంత్ “పేట”, ఇలా భారీ సినిమాలు మంచి క్రేజ్ తో రిలీజ్ అవుతున్నాయి. మరి ఫక్తు ఫ్యామలీ అండ్ యాక్షన్ సినిమా లు తీసే బోయపాటి కెరీర్ పెద్ద ఇట్ సరైనోడు కలెక్ట్ చేసిన షేర్ 80కోట్లు.

మరి బోయపాటి - రాంచరణ్ లు ఈ సినిమాలో ఏదైనా కొత్తధనం చూపించింటే ఈ సినిమా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే 100కోట్ల షేర్ అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. చూద్దాం ఒక వారంలో తెలిసిపోతుంది.

Tags : Vinaya Vidheya Rama, Pre Release Business, Ram charan, Boyapati

Write a comment ...
Post comment
Cancel