back

మార్చ్ లో RRR లో రాంచరణ్ ఫస్ట్ లుక్..?



Share via:

డి.వి.వి దానయ్య నిర్మాణంలో ధర్శకదీరుడు రాజమౌళి ఇద్దరు తెలుగు సూపర్ స్టార్స్ తో తీస్తున్న సినిమా ‘RRR’. పోయిన నవంబర్ నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ అయిపోయిన తరువాత కూడా సినిమాలోని కథానాయికలు పైన క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలను వాళ్ళ స్త్రెంగ్త్స్ ప్రకారం హైలైట్ చేస్తున్నదంట రాజమౌళి. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయట. అలాగే ఎన్టీఆర్ పాత్రకు సంబధించి ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.


బాహుబలి సినిమా సమయంలో ప్రతి ఒక్క యాక్టర్ ఫస్ట్ లుక్ ని వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తూ భాగా హడావిడి చేసిన రాజమౌళి ..ఈ సినిమాకి కూడా అదే ప్లాన్ చేసాడు అంటున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27 న ఈ చిత్రం నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట రాజమౌళి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. చూద్దాం మరి అప్పటికైనా ఈ సినిమా లో నటించే యాక్టర్స్ గురించి ..వాళ్ళ పాత్రల గురించి ఏమైనా తెలుస్తుందేమో..

Tags : RRR, Ram charan, Jr NTR, Raja Mouli

Write a comment ...
Post comment
Cancel