back

రామ్ చరణ్ మగధీరకు 10 ఇయర్స్ పూర్తి



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీని గురించి భారీ ఎత్తున ట్రెండింగ్ నడుస్తోంది. రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ గురించి అది సాధించిన రికార్డుల గురించి అందరూ జ్ఞాపకాల దొంతరలోకి వెళ్తున్నారు. సినిమా చూసే అభిమానులకే ఇలా ఉంటే ఇక అందులో నటించి కెరీర్ బ్రేక్ అందుకున్న హీరో ఫీలింగ్స్ ఎలా ఉండాలి. రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్లో తన ఫీలింగ్స్ ఇలా పోస్ట్ చేసాడు

"అప్పుడే పదేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ నిన్నో మొన్నో చేసినట్టు ఉంది. ఓ కలను నిజం చేసిన పెద్ద టీమ్ గీత ఆర్ట్స్ - అల్లు అరవింద్ - రాజమౌళిలకు చాలా చాలా థాంక్స్. మర్చిపోలేకపోతున్నా. రాజమౌళి గారు అప్పుడు మీతో ఎంతో నేర్చుకున్నా ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నా. ఇవే పదేళ్ల మగధీర గొప్ప జ్ఞాపకాలు"

దీంతో పాటు మగధీర సెట్స్ లో తాను రాజమౌళి ఉన్న పోస్టర్ ని షేర్ చేసుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాడు. నిజంగానే రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ సాధించడం అనే రేర్ ఫీట్ వెనుక రాజమౌళి చేసిన కృషి చాలా ఉంది. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటడంలో కొత్త జెనరేషన్ లో మగధీర పునాది వేయగా బాహుబలి దాన్ని ఎవరు అందుకోలేని స్థాయికి చేర్చింది. అందుకే ఎన్నేళ్ళైనా మగధీరతో మెగా ఫ్యాన్స్ కున్న ఎమోషనల్ కనెక్షనే వేరు

View this post on Instagram

Can’t believe it’s been a decade already! Still seems so recent! A big thank you to the dream team of #Magadheera, Keeravaani garu, @kajalaggarwalofficial & @geethaarts for this memorable film. @ssrajamouli garu, learnt so much from you back then and continuing to do so even now. #10YearsofMagadheera

A post shared by Ram Charan (@alwaysramcharan) on

Tags : Ram Charan, Magadheera, Rajamouli, geetharts

Write a comment ...
Post comment
Cancel