back

జపాన్ అభిమానులనుంచి రామ్ చరణ్ కి స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్



Share via:

జపాన్ అభిమానులకు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ధన్యవాదాలు తెలిపారు. గత నెల మార్చి 27న రామ్‌చ‌ర‌ణ్ 34వ జ‌న్మదినోత్స‌వం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా

చెర్రీకి కొంద‌రు జ‌పాన్ అభిమానులు ఆయన నటించిన `మ‌గ‌ధీర‌` చిత్రంలోని పాత్ర‌లను గ్రీటింగ్ కార్డుల‌పై చిత్రించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ గిఫ్ట్స్ పంపించారు. దీనిపై స్పందించిన చరణ్... `జ‌పాన్ నుంచి స్వీట్ స‌ర్‌ప్రైజ్ అందింది. నా ప‌ట్ల మీకున్న ప్రేమానురాగాలు న‌న్నెంతో సంతోష‌ప‌రిచాయి. త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని కలుస్తాన‌ని ఆశిస్తున్నా. థాంక్యూ జ‌పాన్` అని చెర్రీ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. చెర్రీ తెలుగులో న‌టించిన `మ‌గ‌ధీర‌` జ‌పాన్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇక తన అభిమానులు అంట దూరం నుంచి పంపిన గ్రీటింగ్ కార్డుల‌కు ధన్యవాదాలు తెలిపి వారిని త్వ‌ర‌లోనే క‌లుస్తాన‌ని హామీ ఇచ్చాడు.

Tags : ram charan, Japan, Magadheera

Write a comment ...
Post comment
Cancel