back

హప్పి మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా రాంచరణ్Share via:

చాలామంది హీరోలు అటు సినిమాలతో పాటు ఇటు యాడ్స్ కూడా చేస్తుంటారు. ఒక్క మహేష్ బాబు మాత్రమే చక్కగా వచ్చిన బ్రాండ్స్ అన్నీ రిప్రజెంట్ చేస్తూ తన సత్తా చాటుకుంటూ ఉంటాడు. ఆ తరువాత అల్లు అర్జున్ చేతిలో కూడా రెడ్ బస్ నుండి ఫ్రూటి వరకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ బ్రాండ్ ఎండార్సింగ్ విషయంలో స్పీడ్ పెంచాలని చూస్తున్నాడట.

అప్పట్లో డొకోమో, పెప్సీ వంటి బ్రాండ్లకు సౌత్ అంబాసిడర్ గా రామ్ చరణ్ రచ్చ చేశాడు. కాని తరువాత వాటిని వదిలేశాడు. పూర్తి సినిమాల్లో తేలిపోయాడు. కానీ ఇప్పుడు ఓ మొబైల్ రీటైలర్ కు ప్రచారం చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. హప్పి మొబైల్స్ అనే సంస్థ వారు.. ''‘R you ready to C'' అంటూ ఒక యాడ్ ఇవ్వడంతో.. అక్కడ ఉన్న ఆర్.సి. అనే పెద్ద అక్షరాలను చూడగానే రామ్ చరణ్ అని అర్దమైపోయింది. ఈ డీల్ కోసం రామ్ చరణ్ 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని అంటున్నారు. ఈ బ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం పార్క్ హయత్ లో జరగనుంది.

Tags : Ramcharan, Ramcharan as Brand Ambassador, Happi Mobiles

Write a comment ...
Post comment
Cancel