సంక్రాంతి పండగ ని మెగా అభిమానులకు ముందే తెస్తున్న రాంచరణ్ సినిమా ‘వినయ విదేయ రామ’ సినిమాలోని ఒక్కో పాట వీడియో ప్రోమొలను సినిమా యూనిట్ ధఫధఫాలగా విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫ్యామిలీ సాంగ్ ‘తందానే తందానే’ మరియు ‘తస్సాదియ్యా’ ప్రోమోలు సినిమా మీద హైప్ ని పెంచగా, సినిమా మ్యూజిక్ ఆల్బమ్ లోనే బెస్ట్ సాంగ్ గా చెప్పుకోదగిన సాంగ్ “రాం లవ్స్ సీత” వీడియో ప్రోమోని ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ రోజు అనౌన్సు చేసారు.
వీడియో : తస్సాదియ్యా అంటూ అదరగొట్టిన రాంచరణ్
ఈ పాట వీడియో ప్రోమోని రేపు అనగా జనవరి 6 , ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. వందల మంది డాన్సర్స్ తో చిత్రీకరించిన ఈ సాంగ్ , తనకు చాల ఇష్టం అంటూ హీరోయిన్ కియారా అద్వాని చెప్పినప్పటి నుంచి ఈ పాటని ఎప్పుడెప్పుడు చూడాలని అనుకుంటున్నా అభిమానులకు ఇదొక చిన్న ట్రీట్.
Tags : VVR Songs, Vinaya Vidheya Rama, Ram Charan, Ram Loves Seetha Song