back

వారం వ్యవధిలో రిలీజ్ అవుతున్న రెండు రాంచరణ్ సినిమాలు ..!



Share via:

జనువరి 11న సంక్రాంతి సంధర్బంగా రాంచరణ్ సినిమా ‘వినయ విదేయ రామ’ విడుదల అవుతున్న విషయం మనకంతా తెలిసిందే. అయితే రాంచరణ్ రెండు సినిమాలు ఈ జనవరిలో ఒక వారం వ్యవధిలో రిలీజ్ అవుతున్నాయి, అదేంటి అనుకుంటున్నారా ..

‘రంగస్థలం’ ఈ ఏడాది లో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రం కేరళ లో వచ్చే ఏడాది జనవరి 18న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తోపాటు ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ కూడా మలయాళంలో విడుదలకానుంది. ఈ చిత్రం తెలుగులో 2019 జనవరి 11న రిలీజ్ అవుతుండగా కేరళలో జనవరి 25న విడుదలకానుంది.


ఇలా కేవలం వారం రోజుల వ్యవధిలో రామ్ చరణ్ నటించిన రెండు చిత్రాలు మలయాళం లో విడుదలకానున్నాయి. మరి ఈ చిత్రాలు అక్కడ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో చూడాలి.

Tags : ram charan, ram charan movies, vvr movie updates

Write a comment ...
Post comment
Cancel