back

బాబాయ్ ... రాజకీయం ... సంక్రాంతి పోటీ - రాంచరణ్



Share via:

జనవరి 11 న మన ముందుకు రాబోతున్న ‘వినయ విదేయ రామ’ సినిమా ప్రచారం జోరందుకుంది. ఈ సందర్బంగా సినిమా ముఖ్యులు అంతా ఇంటర్వూస్ ఇస్తున్నారు , అలాగే హీరో రాంచరణ్ కుడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాల పైన సూటిగా సమాధానం ఇచ్చారు.


బాబాయ్ పవన్ కళ్యాణ్

బాబాయ్ అంటే తనకి ప్రాణం అని చెప్పుకునే రాంచరణ్, ఇంటర్వ్యూ లో రాజకీయాలలో పవన్ కి మీరు సపోర్ట్ చేస్తారా అని అడిగితే “ బాబాయ్ ఒక్కసారి పిలుపునిస్తే ఆయన వెనకే మేమంతా అని” సూటిగా సమాధానం చెప్పారు.

రామ్ చరణ్ స్పెషల్ ఇంటర్వ్యూ - వినయ విధేయ రామ

రాజకీయం

మొన్నటి వినయ విదేయ రామ వేడుక లో కే.టీ.ఆర్. అన్న ప్రకారం రాజాకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా అన్న ప్రశ్నకు “కేటీఆర్ గారు నా స్పీచ్ ను మెచ్చుకున్నారు నిజమే కానీ రాజకీయాల్లో రాణించాలంటే చక్కగా మాట్లాడం ఒక్కటే సరిపోదు.  నాకంటే బాగా మాట్లాడే వారు ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారు.  రాజకీయాలలో ఉండడం అనేది బాధ్యతతో కూడుకున్నదే కాక నాలెడ్జ్.. డెడికేషన్ కావాలి" అంటూ పరోక్షంగా తనకు ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని చెప్పేసాడు.

ఎన్.టీ.ఆర్ మరియు F2 ల పైన ...

మీ సినిమాకి పోటీగా ఈ సంక్రాంతికి వస్తున్న ఎన్.టీ.ఆర్. బయోపిక్ కథానాయకుడు మరియు F2 పైన స్పందించమని అడగగా ..

“ఎన్టీఆర్ బయోపిక్ అందరూ గౌరవించాల్సిన చిత్రమని.. ఎన్టీఆర్ టీం ఎంతో బాధ్యతతో.. గౌరవంతో ఆ సినిమాను తెరకెక్కించారని.. క్రిష్ ఎలా దాన్ని తెరపైకి తీసుకొచ్చాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి నేను కూడా ఆ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.”

ఇక 'ఎఫ్ 2' గురించి మాట్లాడుతూ "వెంకీ గారి కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. దాన్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. అయన ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పిస్తారు.  వెంకీ గారి పక్కన వరుణ్ ఎలా చేశాడో చూడాలని ఉంది." అన్నాడు. 

అలా సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని రాంచరణ్ తెలిపాడు.

Tags : Ram Charan, Pawan Kalyan, F2, Vinaya Vidheya Rama, NTR Biopic

Write a comment ...
Post comment
Cancel