back

సంక్రాంతి పందెంలో మెగా బ్రదర్స్ - విజయం ఎవరిది ..?



Share via:

ఎ విషయంలో అయిన మెగా బ్రదర్స్ పోటీలో ఉన్నారంటే విజయం వారికే దక్కాలని కోరుకుంటారు అభిమానులు. మరి సంక్రాంతి సినిమా బరిలో పందెం కోళ్ళలా పోటి పడుతున్న రాంచరణ్-వరుణ్ తేజ్ లలో విజయం వరిస్తుంది అంటే ఇద్దరికి దక్కాలని అంటారు అభిమానులు. జనవరి 11న రామ్ చరణ్ వినయ విధేయ రామ వస్తుండగా 12న వరుణ్ తేజ్ ఎఫ్2 వచ్చేస్తుంది. తనకు ఇలా అన్నయ్యతో పోటీ పడటం ఇష్టం లేదని వరుణ్ తేజ్ గతంలోనే చెప్పాడు. అయితే దిల్ రాజు నిర్మాత కావడం వెంకటేష్ మరో హీరోగా ఉండటంతో నిర్ణయాన్ని ప్రభావితం చేసే శక్తి వరుణ్ కు లేదు. మార్కెట్ పరంగా ఇమేజ్ పరంగా రామ్ చరణ్ తో సరితూగే రేంజ్ లో వరుణ్ తేజ్ లేడు కాని ఇలా కేవలం ఒక్క రోజు గ్యాప్ తో క్లాష్ కావడం అభిమానులను ఇబ్బంది పెట్టేదే.

ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్


సంక్రాంతి సీజన్ కాబట్టి సాధారణ రోజులతో పోలిస్తే మంచి వసూళ్లు వస్తాయి కాని మరో యాంగిల్ లో ఆలోచిస్తే మాస్ మసాలాలు పుష్కలంగా ఉండే విధేయ రాముడి వైపే ఫ్యాన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులు టర్న్ అవుతారు. వెంకీ ఉన్నప్పటికీ మొత్తంగా మార్కెట్ ని ప్రభావితం చేయడం అంత ఈజీ కాదు.  సో అన్నదమ్ముల సవాల్ ని తలపిస్తున్న ఈ పోటీలో విజేత ఎవరు అనేది గెస్ చేయడం కరెక్ట్ కాదు కాని అన్నయ్యతో తలపడటం వల్ల తమ్ముడిగా వరుణ్ కే కాస్త ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాని అభిమానులు మాత్రం ఇద్దరు హిట్ కొట్టాలనే కోరుకుంటున్నారు.

Tags : Ram charan, Varun Tej, F2, Vinaya Vidheya Rama

Write a comment ...
Post comment
Cancel