back

బోయపాటి కోసం చొక్కా విప్పనున్న రాంచరణ్



Share via:

హీరోయిజంను చూపించడానికి డైరెక్టర్స్ కి ఉన్న ఆప్షన్స్ లో హీరోతో చొక్కా విప్పించి బాడీ చూపించడం ఒకటి. బాలీవుడ్ లో ఇలాంటి వాటికి పేటెంట్ ఉన్న హీరో సల్మాన్ ఖాన్, తర్వాత హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లంతా చొక్కా విప్పి కండల ప్రదర్శన చేసిన వారే. సల్మాన్ అయితే దాదాపుగా ప్రతి సినిమాలోనూ ఒక్క సీన్ లో అయినా షర్ట్ వేసుకోకుండా కనిపించి అమ్మాయిలతో విజిల్స్ వేయిస్తుంటాడు. గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కూ పాకింది. టేoపర్ లో ఎన్టీఅర్ అలాగే 'ధ్రువ' లో రాంచరణ్ ఇలాగే చొక్కా విప్పి తమ కండల బాడీ ని చూపించారు.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాస్ పల్స్ బాగా తెలుసు, ఇప్పుడు తన డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీలో వచ్చే ఓ భారీ ఫైట్ ఎపిసోడ్ లో చరణ్ చొక్కా విప్పి తన కండలతో విలన్లను ఎదుర్కోబోతున్నాడు. అసలే బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు ఓ రేంజిలో ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ షర్ట్ లేకుండా ఫైట్ కు దిగడం అంటే సామాన్యంగా ఉండదు మరి. ఈ విషయంలో అభిమానులను మెప్పించడానికి రాంచరణ్ జిమ్ లో చాలానే కష్టపడుతున్నాడు.

Tags : Mega Power Star, Ram Charan, Boyapati Srinu, RC12

Write a comment ...
Post comment
Cancel