back

ఆర్.ఆర్.ఆర్: 40 కోట్లు ఇన్వెస్ట్ చెయ్యనున్న రామ్ చరణ్.?



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ సంయుక్తంగా నటిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకేక్కిస్తున్నాడు.

తారక్, చరణ్ లు కలిసి నటించడం, రాజమౌళి... బాహుబలి తర్వాత ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తుండడంతో ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.


ఈ చిత్ర షూటింగ్ నెల రోజుల క్రింద మొదలయ్యి మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం స్వాతంత్రం రాకముందు 1900లో జరిగిన కథగా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఎన్.టి.ఆర్ ఒక ముస్లిం యువకుడిగా ప్రతినాయకుడి పాత్ర చేయ్యనున్నట్టుగా తెలుస్తుంది. ఇక రెండవ షెడ్యూల్ ని సంక్రాంతి తర్వాత మొదలుపెట్టాలి అని మూవీ టీం డిసైడ్ అయ్యింది. ఎందుకంటే ఈ మధ్యలో రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జరగనుంది.

ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు, కానీ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో పెట్టుబడి పెట్టబోతున్నాడు అనే వార్త తెలుగు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.


రామ్ చరణ్ ఇప్పటికే నిర్మాతగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన ఖైది నం.150ని తన ప్రొడక్షన్ సంస్థ అయిన కొణిదెల ప్రో కంపెనీ పై నిర్మించాడు. ఇప్పుడు తను నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో పెట్టుబడిగా 40 కోట్లు పెట్టనున్నాడు.

చరణ్ ఒక చిత్రానికి రెమ్యునరేషన్ గా 18 కోట్ల వరకు తీసుకుంటాడని టాక్, అయితే రంగస్థలం బారీ విజయం సాదించడంతో తన రెమ్యునరేషన్ ని 20 కోట్లకు పెంచినట్టుగా తెలుస్తుంది.


ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ, ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి ప్రొడ్యూసర్ దానయ్య కావడంతో, మొత్తం రెండు చిత్రాలకి కలిపి 40 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే, చరణ్ ఆ 40 కోట్లను ఆర్.ఆర్.ఆర్ చిత్ర పెట్టుబడికి ఉపయోగించమని, చిత్రం విడుదల అయిన తర్వాత ప్రాఫిట్స్ షేర్ చేసుకుందాం అని ప్రపోసల్ పెట్టాడట. దీనికి దానయ్య కూడా ఒకే అన్నట్టు సమాచారం.

Tags : RRR Movie, Rajamouli, Ram Charan, NTR

Write a comment ...
Post comment
Cancel