back

గ్యాంగ్ లీడర్ 2 గా రాంచరణ్ ...



Share via:

మొన్న జరిగిన సాయి ధరం తేజ్ “తేజ్ ఐ లవ్ యు” సినిమా ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి చేసిన ఒక అనౌన్స్మెంట్ తో రామచరణ్ గ్యాంగ్ లీడర్ 2 తీయబోతున్నాడా అనే వార్త పాకేసింది పరిశ్రమలో. తేజ్ ఐ లవ్ యు సినిమాను ఒకప్పుడు పెద్ద బ్యానర్ అయిన క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పైన సీనియర్ నిర్మాత కే.ఎస్.రామారావు నిర్మించాడు.

ఇదే రామారావు ఒకప్పుడు చిరంజీవితో పెద్ద పెద్ద హిట్స్ అయిన అభిలాష.. ఛాలెంజ్.. రాక్షసుడు.. మరణ మృదంగం అందించాడు. ఇప్పుడు ఈ నిర్మాతకి చిరంజీవి ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చేసాడు, అదే రాజమౌళి తో సినిమా అయిపోగానే రాంచరణ్ చేయబోయే సినిమాకి నిర్మాత రామారావు అని. పైగా గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఆ సినిమా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక దర్శకుడిని ఒక మంచి కథను సెట్ చేసుకుంటే గ్యాంగ్ లీడర్ మ్యానియా మొదలవ్వచ్చని టాక్.

Tags : Gang Leader 2. Ram Charan, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel