back

అభిమానులతో పండగ జరుపుకోనున్న రాంచరణ్



Share via:

తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోన్న రంగస్థలం, రెండో వారాంతంలో కూడా ఫస్ట్ వీకెండ్ కు ధీటుగా వసూళ్లను సాధించడం.. అనేది సినిమాపై జనాల్లో ఉన్న క్రేజ్ కు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఆదివారం అయితే.. దాదాపు అన్ని ఏరియాల్లోనూ హౌస్ ఫుల్స్ సాధించేసిన రామ్ చరణ్ మూవీ.. ఇప్పటికే 95 కోట్ల షేర్ తో టాలీవుడ్ టాప్ హిట్స్ లో 4వ స్థానాన్ని అందుకుంది.

మరికొన్ని రోజుల్లో ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని అధిగమించి.. టాప్3 స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమా సక్సెస్ తో ఆనందంగా ఉన్న రాంచరణ్ సినిమా యూనిట్ తో కలిసి తమ ఆనందాన్ని మెగా అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించారు.. ఈ నెల 14వ తేదీన మెగా ఫాన్స్ కి ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వాలని చరణ్ అండ్ టీం డిసైడ్ అయ్యారు. ఎలాగూ చిరంజీవి ఈ పార్టీలో ఉంటారనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్ తో పాటు రంగస్థలం యూనిట్.. అలాగే సినిమా డిస్ట్రిబ్యూటర్లను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.

Tags : Rangasthalam Celebrations, Rangasthalam Success, Ram Charan, Mega Power Star, Mega Fans, Rangasthalam, Sukumar, Samantha

Write a comment ...
Post comment
Cancel