back

జనసేనా కి మద్దత్తుగా చెర్రీ ట్వీట్



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు మద్దతుగా సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టాడు. ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రముఖ సినీ హీరోగా పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇతర పార్టీల మాదిరిగా జనసేనకు సినీ గ్లామర్ తక్కువే. మెగా కుటుంబం నుంచి నాగబాబు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయినా కూడా జనసేన తరుపున మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ వచ్చి ప్రచారం నిర్వహించింది లేదు.

మెగాస్టార్ చిరంజీవి.. జనసేనకు మద్దతుగా ఏ ఒక్కరూ ప్రచారం నిర్వహించడానికి వీల్లేదంటూ మెగా ఫ్యామిలీకి హుకుం జారీ చేసినట్టుగా ఆ మధ్య వార్తలొచ్చాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొనకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే తాజాగా జనసేనకు మద్దతుగా చెర్రీ ట్వీట్ పెట్టి అభిమానులను ఆకట్టుకున్నాడు. ‘‘అద్భుతమైన మేనిఫెస్టో. సమాజంలోని అన్ని విభాగాలకు సమ న్యాయం చేస్తోంది. రాజకీయాల్లో ఇదొక సరికొత్త పంథా. కల్యాణ్ బాబాయికి కంగ్రాట్స్. అలాగే జనసేన పార్టీ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేసిన చెర్రీ.. ఓట్ ఫర్ గ్లాస్, జనసేన రివల్యూషన్ 2019 హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశాడు.

Tags : Ram charan, Pawan Kalyan, Janasena

Write a comment ...
Post comment
Cancel