back

నెక్స్ట్ సినిమా షూటింగ్ లో రాంచరణ్



Share via:

రంగస్థలం సినిమా విజయంతో మంచి ఊపు మీదున్న రాంచరణ్, తన తర్వాత సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. హీరో లేకుండానే రెండు షెడ్యూల్ పూర్తి చేసిన బోయపాటి శ్రీను ఇప్పుడు మూడో షెడ్యూల్ లో రాంచరణ్ తో సీన్స్ తీస్తున్నాడు.

ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్టు మేకోవర్ కావాలని సల్మాన్ ఖాన్ వ్యక్తిగత ఫిట్ నెస్ ట్రయినర్ ఆధ్వర్యంలో చరణ్ కాస్త కండలు పెంచాడు. ఆ న్యూ లుక్ తో బోయపాటి సినిమా సెట్స్ పైకి వచ్చాడు. భరత్ అనే నేను సినిమాతో హిట్ కొట్టి, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ సినిమాలో చరణ్ సరసన నటిస్తోంది.

ఈ సినిమాకి రాజవంశస్థుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటించబోతున్నారు.

Tags : Ram Charan, Boyapati Sreenu, RC12, DVV Danayya

Write a comment ...
Post comment
Cancel