back

దానయ్యకి మామిడి బుట్ట పంపిన చరణ్



Share via:

నిన్న (జూన్ 14) మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసనల పెళ్లిరోజు. ఈ సందర్భంగా తమను విష్ చేసిన వాళ్ళందరికీ ఉపాసన తన సోషల్ పేజి ద్వారా ధన్యవాదములు తెలిపారు. తమ పెళ్లిరోజు కానుకగా పలువురు సన్నిహితులకు తమ తోటలో పండిన మామిడి పండ్లను పంపి కాస్త వెరైటీగా సెలెబ్రేట్ చేసుకున్నారు చెర్రీ దంపతులు. ఈ కోవలోనే నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా మామిడి పండ్ల బుట్ట పంపించారు ఈ దంపతులు. అయితే చెర్రీ దంపతులు పంపిన ఈ మామిడి పండ్ల బుట్టను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న డీవీవీ.. ‘‘స్వీటెస్ట్ మాంగోస్ ఫ్రమ్ స్వీటెస్ట్ కపుల్ రామ్చరణ్, ఉపాసన కొణిదెల. ధన్యవాదాలు.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ’’ అని తెలిపారు.

ram charan sent mangoes for dvv danayya

Tags : Mega Power Star, Ram Charan, DVV Danayya, Mangoes

Write a comment ...
Post comment
Cancel