back

RRR కథ , తన పాత్రల గురించి రాంచరణ్ ...



Share via:

వినయ విదేయ రామ సినిమా ప్రచారంలో బిజీ గ ఉంటున్న రాంచరణ్ , ఆ ప్రచారపు ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు.ఇప్పటికే సైరా బడ్జెట్, రిలీజ్ గురించి మాట్లాడిన చరణ్, కొత్తగా తన RRR సినిమా కథా మరియు పాత్రల గురించి వెల్లడించాడు. అవేంటంటే ..


RRR కథ

"రాజమౌళి కథ చెప్పడం పూర్తయిన తర్వాత అంతా నిశ్శబ్దం. ఒక షాక్ లో అలా ఉండిపోయాను. ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా అనే ఆశ్చర్యంతో అలా కాసేపు సైలెంట్ గా ఉండిపోయాను. పక్కనే ఉన్న తారక్ ఫస్ట్ రియాక్ట్ అయ్యాడు. ఆ సైలెన్స్, ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి నాకు కాస్త టైం పట్టింది. రాజమౌళి మమ్మల్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత కథ అనుకోలేదు. కథకు మమ్మల్ని ఫిక్స్ చేసిన తర్వాతే మా ఇద్దర్నీ కూర్చోబెట్టి కథ చెప్పారు. ఇద్దరు ఆర్టిస్టులు దొరికేశారని రాజమౌళి కథ అల్లరు. అది ఆయన నైజం కాదు. రాజమౌళి సినిమా పని మీదే నేను, తారక్ కాలిఫోర్నియా వెళ్లాం. చిన్న గ్రాఫిక్ వర్క్ కోసం ఇద్దరం కలిసి వెళ్లాం."

నిర్మాత, ఎగ్జిబిటర్లు బాగుంటేనే నాకు ఆనందం - రాంచరణ్

RRR లో పాత్ర

“రంగస్థలంలో లాగానే మరోసారి డీగ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తున్నాను. ఎస్.ఎస్.రాజమౌళి మళ్లీ డి గ్లామరైజ్డ్ పాత్రనే సృష్టించారు. ఈపాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్టవుతుంది. ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. 2019  మొత్తం ఈ సినీమాకే కేటాయించాను.”

ఎన్టీఆర్ తో అనుబంధం

“ఎన్టీఆర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ చిత్రంలో మా ఇద్దరి కాంబినేషన్ సీన్లు చాలా బాగా వస్తున్నాయి. ఎన్టీఆర్ తో కలసి పనిచేస్తుండడం చక్కని అనుభూతిని ఇస్తోంది. మిగతా హీరోలతో బాండింగ్ విషయానికొస్తే ఎప్పట్నుంచో నేను మిగతా హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటాను. సోషల్ మీడియాలో చూసిన తర్వాత జనాలకు ఇప్పుడిప్పుడే మేం కలుస్తున్నాం అని అనిపించొచ్చు. కానీ మేం చాన్నాళ్లుగా క్లోజ్. తారక్ నే తీసుకుంటే, చాలా ఏళ్లుగా మేమిద్దరం ఫ్రెండ్స్. మహేష్ తో ఈమధ్య కాలంలో బాగా కలుస్తున్నాను.”

ఈ విధంగా రాంచరణ్ తన సినిమా ప్రచారంలో తన తదుపరి సినిమా విశేషాలు తెలిపి ఆ సినిమా పైన ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న హైప్ ని ఇంకా పెంచేసాడు.

Tags : RamCharan, VVR, RRR, Jr NTR, Rajamouli

Write a comment ...
Post comment
Cancel