back

బ్యాంకాక్ నుంచి తిరుగు ప్రయాణం కానున్న రాంచరణ్



Share via:

కొద్ది రోజుల క్రితం డి.వి.వి దానయ్య నిర్మాణంలో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా కోసం బ్యాంకాక్ వెళ్ళిన రాంచరణ్ మరియు ఇతర సినిమా యూనిట్ అంతా ఈ రోజు తిరుగు ప్రయాణం అవుతున్నారు. బ్యాంకాక్ లో షెడ్యూల్ మొత్తం కొద్దిసేపటి క్రితమే పూర్తైంది. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కైరా అద్వానీల మీద కొన్ని రొమాంటిక్, కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు, ఎక్కడ మొదలవుతుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బోయపాటి శ్రీనివాస్ మెగా హీరోతో తీస్తున్న తొలి సినిమా అవ్వడం అందులో రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రాంచరణ్ తో సినిమా అవ్వడం తో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని రాంచరన్ మొన్న మేము సైతం టీవీ ప్రోగ్రాంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి జవాబుగా తెలిపాడు. మరి మెగా అభిమానులకు మరో రంగస్థలం ఈ సంవత్సరంలోనే రాంచరణ్ ఇవ్వబోతున్నాడ అనేది వేచి చూడాల్సిందే....

Tags : Ram Charan, RC12, Bangkok Schedule

Write a comment ...
Post comment
Cancel