back

హాలీవుడ్ ఎంట్రీ పై స్పందించిన రాంచరణ్Share via:

ఇటీవలే రంగస్థలం బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ ఇమేజ్ సాదించుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా తన హాలీవుడ్ ఎంట్రీ పై స్పందించాడు.

ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి, మీరు హాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకి చరణ్ బదులిస్తూ... నా పని నాకు ఇక్కడ చాలా సంతృప్తినిస్తుంది అని అలాగే తనకి కెరీర్ ప్లానింగ్ పై నమ్మకం లేదు అని చెప్పుకొచ్చాడు.

అలాగే తనకి నప్పే హిందీ కథలు వస్తే మాత్రం తప్పకుండా చేస్తా అని అన్నాడు. తను కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్లోకి ఆరంగ్రేటం చేసిన జంజీర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకోట్టడం తనని చాల నిరాశలోకి నెట్టేసింది అని చేస్ప్పాడు.

Tags : Mega Power Star, Ram Charan, Hollywood

Write a comment ...
Post comment
Cancel