back

అజర్బైజాన్ లో అదిరే ఫైట్లు...RC12



Share via:

బోయపాటి తో చరణ్ చేస్తున్న సినిమా టైటిల్ ప్రకటించకపోవడంతో ఈ సినిమాను #RC12 గా పిలుచుకుంటున్నారు అభిమానులు.  ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం ఫిలిం యూనిట్ అజర్ బైజాన్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే.  25 రోజులు జరుగనున్న ఈ షెడ్యూల్ లో బోయపాటి  భారీ యాక్షన్ సీక్వెన్స్ ను - కీలక సన్నివేశాలను తీస్తున్నారు.

ఇక ఈ సీన్స్ ఎలా ఉండబోతున్నాయో అభిమానులకు చరణ్ & ఉపాసన తమ సోషల్ మీడియా ద్వారా చరణ్ స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న ఫోటోను  పోస్ట్ చేసి "#RC12 అజర్ బైజాన్ షెడ్యూల్ కు అంతా సిద్దం.  రఫ్ & రా గా ఉండబోతోంది!" అని పోస్ట్ చేసారు.  ఇక బోయపాటి అంటేనే రచ్చ రంబోలా ఫైట్లకు కేరాఫ్ అడ్రెస్.. ఇక అజర్ బైజాన్ లప్ ఫైట్లు అదిరిపోవడం ఖాయం.

Tags : Ram Charan, Boyapati Srinu, RC12 Azerbaijan Schedule

Write a comment ...
Post comment
Cancel