back

బన్నీ ఈవెంట్ లో రాంచరణ్ ఆసక్తికర వ్యాక్యలు ..



Share via:

నిన్న జరిగిన అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గ వచ్చిన రాంచరణ్ కొన్ని ఆసక్తికర వ్యాక్యలు చేసారు.

అల్లు అరవింద్ చేసిన వ్యాక్యలను పూరిస్తూ “దేశంలో అవినీతి లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే, సినిమా వాళ్లమంతా ఉదయం ఐదింటికి లేస్తాం. జిమ్ చేసి తరవాత మేకప్ వేసుకుని షూటింగ్ స్పాట్ కు వెళతాం. రాత్రి వరకు అక్కడే ఒళ్ళు హూనమయ్యేలా పనిచేస్తాం. ప్రేక్షకులను మెప్పించేందుకు ఎన్నో రిస్కీ షాట్స్ చేస్తాం. దానిమూలంగా ఎన్నోసార్లు గాయపడుతుంటాం. బన్నీ ఎన్నిసార్లు గాయపడ్డాడో నాకు తెలుసు. ప్రభాస్ కు రెండుసార్లు భుజానికి సర్జరీ అయింది. మా డాడీ చిరు మరియు బాలక్రిష్ణ గారు ఈ మధ్యన భుజానికి సర్జరీ చేయించారు.ఒళ్లు హూనం చేసుకుని రేపు ఏం చేయాలి అని ఆలోచిస్తాం. ఈ ప్రాసెస్ లో కరెప్షన్ ఎక్కడుంది.’’

బన్నీనే నా గురించి నాన్నకి ధైర్యం ఇచ్చాడు అంటూ ‘‘చిన్నప్పుడు ఇంట్లో ఫంక్షన్ల లాంటివి జరిగితే నేను డ్యాన్స్ చేసేవాడిని కాదు. అదో రకమైన భయమేమో. బన్నీ మాత్రం అన్నింటా ముందుండేవాడు. డాడీ కూడా బన్నీని చూసి నేర్చుకోమని తిడుతుండేవారు. అసలు డ్యాన్సు చేయకుండా సినిమాల్లో మెప్పించగలడా.. లేక పరువు తీసేస్తాడా అని డాడీకి అనిపించింది. అప్పుడు బన్నీని పిలిచి ఇదే అనుమానం వ్యక్తం చేస్తే చరణ్ డ్యాన్స్ ఇరగదీస్తాడు. మీరు ధైర్యంగా ఉండమంటూ భరోసా ఇచ్చాడు. బన్నీ మాటతో నాన్నకు కూడా ధైర్యం వచ్చి ఆపై నన్నెప్పుడూ తిట్టలేదు’’.

Tags : Ram Charan, Allu Arjun

Write a comment ...
Post comment
Cancel