back

వాళ్ళ వల్లనే విభిన్న కథలు ఎంచుకున్నా - రాంచరణ్



Share via:

తండ్రి చాటు బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి నిర్ణయం మేరకు సినిమాలు చేస్తూ వచ్చిన రాంచరణ్ ఉన్నట్లుండి రెండు ప్రయోగాత్మక సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. మగధీర లాంటి పెద్ద హిట్ ఇచ్హినా కూడా ఎవ్వరికీ రాంచరణ్ నటన పైన పెద్దగా అంచనాలు లేవు. అలాంటిది రంగస్థలం సినిమా మొత్తం అశేష జనవాహినికి నచ్చడమే కాకుండా తన 10 సినిమాలకు రానంత పేరుని రామచరణ్ కి ఈ ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. నటనలో చిరంజీవి స్థాయిని తాకాడని విమర్శకులు కుడా అంటుంటే అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మరి ఇలాంటి సినిమా చేసే సాహసం చేయడానికి చరణ్ కి ఏంటి స్ఫూర్తి అనేది తనే ఒక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారు ...

ట్రెండింగ్: రాంచరణ్ సహాయంతో కోలుకున్న ధనుష్

కలెక్షన్స్: నా పేరు సూర్య... 4 డేస్ కలెక్షన్స్

“వాణిజ్య విలువలతో పాటు మంచి కథా బలం ఉన్న చిత్రాలను ఎంచుకొని నటించే వారికీ అమిర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లు ఆదర్శం. వారు చేసిన దంగల్ - భజరంగి భాయీజాన్ సినిమాలు ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చాయి. కథల ఎంపికలో వారిని బాగా ఫాలో అవుతుంటాను. ఈ తరం వారికి వాళ్లు ఐకాన్”

ఇక రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాను నేను నా బిజినెస్ పరిధి గురించి ఎంత మాత్రం ఆలోచించలేదు. 1980 నాటి కథ కావడంతో అందులో పాత్రకి ఎంత వరకు నేను న్యాయం చేయగలను అనే విషయాన్ని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించాను. సినిమాలో సెట్స్ ఆడియెన్స్ బాగా నచ్చాయి. రంగస్థలం చిత్రం మంచి విజయం దక్కడంతో మా అందరికి ఎంతగానో సంతృప్తి లభించిందని రామ్ చరణ్ వివరించాడు.

బన్నీ బ్లాస్టర్: మలయాళం, తమిళ్ లో బన్నీ హవా

Tags : Ram Charan, Mega Power Star, Rangasthalam

Write a comment ...
Post comment
Cancel