back

మహానటి పైన స్పందించిన రాంచరణ్



Share via:

మ‌హాన‌టి సావిత్రి నిజ‌జీవిత క‌థ ఆధారంగా కీర్తి సురేష్ మహానటి గా నాగ్ అశ్విన్ తీసిన సినిమా “మహానటి” ఈ వేసవి లో విడుదలై దిగ్విజయంగా సాగుతుంది. ఈ సినిమాపై ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. నిన్ననే ఈ సినిమా చూసిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన్ ఫేస్బుక్ పేజి ద్వారా ఈ సినిమాపై స్పందించాడు.

`ఓ న‌టుడినైన న‌న్ను`మ‌హాన‌టి` సినిమా ఎంత‌గానో క‌దిలించింది. ఇంత గొప్ప సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించిన డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్ర‌శంస‌నీయుడు. ఇక‌, సావిత్రిగారి పాత్ర‌లో కీర్తి సురేష్ అద్భుతంగా న‌టించింది. ఆమె కాకుండా మ‌రెవ‌రూ ఈ పాత్ర‌ను ఇంత అద్భుతంగా పోషించ‌లేరు. ఈ సినిమాను నిర్మించ‌డానికి ధైర్యంగా ముందుకు వ‌చ్చిన స్వ‌ప్న‌, ప్రియాంకల‌కు, చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు` అంటూ చెర్రీ కామెంట్ చేశాడు.

Tags : Ram Charan on Mahanati, Keerthy Suresh, Mahanati Savitri, Mega Power Star

Write a comment ...
Post comment
Cancel