back

#RRR కోసం రెడీ అంటున్న ఎన్టీఆర్ - చరణ్



Share via:

ఇంకా పేరు పెట్టని, అస్సలు కొబ్బరి కాయే కొట్టని ఒక సినిమా గురించి ఎటువంటి చిన్న వార్త వచ్చిన దేశవ్యాప్తంగా సిని అభిమానులంతా ఆసక్తిగా చూస్తున్నారంటే - అదే ధర్శకదీరుడు రాజమౌళి తీయబోయే మల్టిస్టారేర్.  జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయిక గురించి ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇద్దరి హీరోల అభిమానులు ఎప్పుడెప్పుడు ఇది మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. నవంబర్ మొదటివారంలోనే ఈ సినిమా షూటింగ్ కు ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. చరణ్ తారక్ ఇద్దరూ కలిసి పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి ఆ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది.

2020 లో విడుదల అవ్వనున్న ఈ సినిమా , చరణ్-తారక్ ల అభిమానులకు ఒకవైపు ఆనందంగా ఉన్నా, ఇంకో పక్కా సంవత్సరం పైనే తమ అభిమాన హీరో ని వెండి తెర పైన చూడలేమనే బాధ కూడా ఉంది. కాని రాజమౌళి తీసే సినిమాల వల్ల వచ్చే పేరుతో పోల్చుకుంటే ఒక సంవత్సరం పెద్ద సమయం కాదని హీరోలే రెడీ అంటుంటే ఇంకా అభిమానులది ఏముంది, వాళ్లింకా రెడీ.

Tags : Mega Power Star, Ram Charan, NTR, Rajamouli

Write a comment ...
Post comment
Cancel