back

రాంచరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ బడ్జెట్ అంతా..!



Share via:

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీపై రోజుకో న్యూస్ వైరల్ అవుతు వస్తుంది. నిన్నటి వరకు విలన్ విషయంలో రకరకాల మాటలు వినిపించాయి... ఒకసారి హీరో రాజశేకర్ విలన్ అని తర్వాత కాదు కాదు ఇందులో విలన్ ఎన్టీఆర్ యే అని అనేక విధాలుగా వినిపించాయి... అయితే అవి అలా వుండగా తాజాగా మరో గాసిప్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అంటూ కొంత మంది చెప్పడం జరిగింది. రాజమౌళి ఏం తీసినా భారీగానే ఉంటుందనే నేపథ్యంలో రాం చరణ్ – ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ కూడా అంత బారీ బడ్జెట్ తో వుంట్టుందని వారి అంచనా.

రంగస్థలం 8 Days కలెక్షన్స్

టాలీవుడ్ లో రాజమౌళి సినిమాకి... భారీ క్రేజ్ ఉంది. దీనికి స్టార్స్ హీరోస్ అయిన చరణ్ ,ఎన్టీఆర్ తోడైతే ఆ సినిమా రేంజ్ ఆకాశాన్ని తాకుతుంది.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించే చరణ్, ఎన్టీఆర్ మల్టిస్టారర్ పై ఇదే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఏ విషయం తెలిసినా హాట్ న్యూస్ అయిపోతుంది. అయితే రీసెంట్ గా రామ్ చరణ్ కథనే వినలేదు అని చెప్పాడు. అలాగే అటు ఎన్టీఆర్ కూడా అలాగే చెప్పాడు. ఇప్పుడు అంత రాజమౌళి చేతుల్లో వుంది, ఈ సినిమాకి సంభందించిన విషయాలు అన్ని, అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 250 కోట్ల దాకా అవుతుందని... దానికి తగ్గట్టు దానయ్య సన్నద్ధం కావాలని రాజమౌళి చెప్పినట్టు టాక్.

అయితే ఈ సినిమా కి సంభందించిన బడ్జెట్ 250 కోట్లు అంటూ వస్తున్న కామెంట్ నిజమో కాదో నిర్ధారించే రుజువు ప్రస్తుతానికి లేదు కానీ ఈ లెక్క విన్నవాళ్ళు మాత్రం షాక్ అవడం ఖాయం. బాహుబలి అయితే ఒక ఫాంటసీ కథ కాబట్టి బడ్జెట్ ని అంత రేంజ్ లో పెట్టారు. స్టోరి కొత్తగా ఉండటంతో భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా దానికి బ్రహ్మరథం పట్టారు ఆడియెన్స్. కానీ ఇప్పుడు తీయబోయే మల్టీస్టారర్ ఒక కమర్షియల్ మూవీ. రెగ్యులర్ ఫార్ములాలో రాజమౌళి తనదైన శైలిలో మిక్స్ చేసే హీరోయిజంతో ఉంటుంది. మరి ఇలాంటి సినిమాకి 250 కోట్ల బడ్జెట్ అవసరమా అనే వాళ్ళు ఉన్నారు.. ఆ ఇద్దరి హీరోలు కలిసి చేస్తున్నారు కాబట్టి అంత బడ్జెట్ అవసరమే అనేవాళ్ళు ఉన్నారు. చూద్దాం మరి ఇది నిజమైన వార్తన గాలి వార్తన కొన్నిరోజుల్లో తెలిసిపోద్ది.

రంగస్థలం 1st Week కలెక్షన్స్

Tags : Ram charan - NTR Film, Ram Charan-NTR, Ram Charan film with Rajamouli, Ram Charan - NTR Multistarrer Budget, RRR Movie Budget

Write a comment ...
Post comment
Cancel