back

చిట్టి బాబు... కొత్త లుక్



Share via:

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ చిత్రం గురించే చర్చలు నడుస్తున్నాయి. ధృవ తర్వాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. ఇందులో చెర్రీ ఒక చెవిటి వాడి పాత్రలో కనిపించబోతున్నాడు.ఒక తెలుగు హీరో, అందునా స్టార్ హీరో అలాంటి గెటప్ లో కనిపించడం ప్రయోగాత్మకమే.

అలాంటి ప్రయోగానికి ఎలాంటి హిట్ ప్రతిఫలంగా దక్కుతుందో మరో 3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాంచరణ్ కొత్త లుక్ లో అదరగొడుతున్నాడు. మార్చి 30న ‘రంగస్థలం’ విడుదల అవుతుండగా.. తన తర్వాతి సినిమాకు సంబంధించిన లుక్ తాజాగా విడుదల అయ్యింది. చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమాలో చరణ్ లుక్ ఒకటి విడుదల చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ram charan boyapati film new look

Tags : Ram Charan New Look, Boyapati Srinu

Write a comment ...
Post comment
Cancel