back

రాంచరణ్ అనే నేను ..!



Share via:

మెగా పవర్ స్టార్ రామచరణ్ , చిరంజీవి తనయుడిగా సినిమా లోకి వచ్చి ఈ రోజు తనకంటూ ఒక ప్రతేయకమైన గుర్తింపు మరియు అభిమానులను సంపాదించారు. రంగస్థలం ఘన విజయంతో ఆనందంగా బోయపాటి సినిమాలో నటిస్తున్న చరణ్, నార్త్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. అవి కొన్ని మీ కోసం ...

ప్రశ్న : సినిమాల్లోకి రాకుంటే ఎం చేసేవారు ?
జవాబు : హీరో అవడానికి మొదటి కారణం నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. చిన్నప్పుడు మా నాన్న కోసం అభిమానులు ఇంటి ముందుకు వస్తే ఆయన బాల్కనీ నుంచి వారికి హాయ్ చెప్పడం... ఇలాంటివన్నీ నన్ను హీరో అయ్యేలా ప్రేరేపించాయి. నేను నటుడ్ని కాకపోయి ఉంటే ఆకతాయిగా తిరుగుతూ ఉండేవాడిని అని నవ్వుతూ చెప్పాడు చెర్రీ.

ప్రశ్న : ట్విట్టర్ నుంచి ఎందుకు వైదొలిగారు ?
జవాబు : నేను పేస్బుక్ మాత్రమే వాడుతున్న ప్రస్తుతం , త్వరలో ఓ మంచి ముహూర్తం చూసి ఇన్‌స్టాగ్రాం, ట్విటర్ ఖాతాలు తెరుస్తాను. ఇది వరకు నాకు ట్విటర్ అకౌంట్ ఉండేది. కానీ దాన్ని బ్లాక్ చేసేశాను. ఎందుకంటే.. ట్విటర్‌లో దేని గురించైనా కామెంట్ చేయాలనుకుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందోనన్న భయం ఉంది. ఈ గొడవంతా ఎందుకని ట్విటర్ నుంచి తప్పుకున్నాను.

ప్రశ్న : RRR కథ ఏమిటి ?
జవాబు : రాజ‌మౌళి సినిమా గురించి మీకెంత తెలుసో, నాకూ అంతే తెలుసు. సినిమా ఎప్పుడు పూర్త‌వుతుందో కూడా చెప్ప‌లేను. కానీ, ఈ సినిమా గొప్పగా ఉండ‌బోతోంద‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. అలాగే ప్రచారంలో ఉన్న‌ట్టు ఇది బాక్సింగ్ నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న‌ సినిమా కాదు. నాకు ఇంత‌వ‌ర‌కే తెలుసు. రాజ‌మౌళి సినిమా కాబ‌ట్టి మారు మాట్లాడ‌కుండా అంగీక‌రించాను.

ప్రశ్న : ఎన్టీయార్ తోనే ముల్తిస్తార్రెర్ ఎందుకు ?
జవాబు : ఎన్టీయార్‌, నేను మంచి మిత్రులం. మేం మూడు నెల‌లకోసారి క‌లుస్తూనే ఉంటాం. ఇటీవ‌లె తార‌క్ వివాహ వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నాం. మా స్నేహం చూసిన త‌ర్వాతే మా ఇద్దరినీ పెట్టి సినిమా తీయాల‌ని రాజ‌మౌళిగారికి అనిపిన్చిన్దవచ్చు.

Tags : Mega Power Star, Ram Charan, Rangasthalam, Ram Charan latest interviews

Write a comment ...
Post comment
Cancel